Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. కానిస్టేబుల్, హోంగార్డులకు గాయాలు

Kamareddy | పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. కానిస్టేబుల్, హోంగార్డులకు గాయాలు

హైవేపై పెట్రోలింగ్​ చేస్తున్న పోలీస్​ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్​, హోంగార్డు గాయపడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | హైవే పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని (Patrol Vehicle) లారీ ఢీకొన్న ఘటన 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వెనక నుంచి లారీ ఢీకొనడంతో కానిస్టేబుల్, హోంగార్డులకు గాయాలయ్యాయి.

కామారెడ్డి (Kamareddy) మండలం క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 5.40 గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం యూటర్న్ తీసుకుంటుండగా వెనకనుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సదయ్య అనే కానిస్టేబుల్​ (Constable)కు తీవ్ర గాయాలు కాగా, హోంగార్డ్ స్వామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. కానిస్టేబుల్ సదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ (Hyderabad)​కు తరలించారు. స్వామిరెడ్డికి చికిత్స కొనసాగుతోంది. కాగా ప్రమాదానికి కారణమైన లారీని టోల్ ప్లాజా వద్ద పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దేవునిపల్లి పోలీసులు (Devunipalli Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News