అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30 గొర్లు మృతి చెందాయి. పొందుర్తి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ (Mahabubnagar) నుంచి గొర్ల మందను తీసుకుని జాతీయ రహదారి వెంట హైదరాబాద్ వైపు కొంతమంది గొర్ల కాపరులు వస్తున్నారు.
అయితే హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్తున్న లారీ గొర్లమంద పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్ల కాపరి అక్కడికక్కడే మృతి చెందగా 30 గొర్లు మృత్యువాత పడ్డాయి. మరొక వ్యక్తి కాలు విరిగింది.
దేవునిపల్లి పోలీసులు (Devunipalli police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని, గాయపడిన వ్యక్తిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా మర్కెల్ గ్రామానికి చెందిన గుడిగండ్ల రామప్పగా గుర్తించారు. కాలు విరిగిన వ్యక్తి బసాయిల మల్లేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kamareddy | కరీంనగర్ నుంచి హైదరాబాద్..
కాగా మహబూబ్ నగర్‌కు చెందిన సుమారు 20 మంది గొర్ల కాపరులు గొర్లను రహదారి వెంట మేపుతూ ఉంటారు. దాదాపు 600 నుంచి 700 గొర్లను తీసుకుని రోడ్ల వెంట మేపుకుంటూ ఎక్కడ రాత్రయితే అక్కడే వంట చేసుకుని ఉదయాన్నే మళ్లీ రహదారి వెంట వెళ్తారు.