Homeక్రైంSadashivnagar | బైక్​ను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

Sadashivnagar | బైక్​ను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Sadashivnagar | ఎదురుగా వస్తున్న బైక్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం మోడెగాం శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన గంగుల నర్సాగౌడ్(55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డికి బైక్​పై వెళ్తున్నాడు. మోడెగాం శివారులోని రైస్​మిల్(Rice Mill)​ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Must Read
Related News