21
అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Toll Plaza | భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఇందల్వాయి టోల్‌ప్లాజ్ (Indalwai toll plaza) వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఎస్సై సందీప్ (Sub-Inspector Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేఘ్య నాయక్ తండాకు చెందిన లొంబ అనే వ్యక్తి టోల్‌ప్లాజా వద్ద భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అయితే గురువారం ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో లొంబ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.