అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kadapa | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉంది. రాయచోటి నుంచి కడప(Kadapa) వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి(Hospital)కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
