ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nara Lokesh | టీడీపీలో స్ట్రాంగ్ అవుతున్న యువ‌త‌రం.. నారా లోకేష్‌కి కీల‌క బాధ్య‌త‌లు..!

    Nara Lokesh | టీడీపీలో స్ట్రాంగ్ అవుతున్న యువ‌త‌రం.. నారా లోకేష్‌కి కీల‌క బాధ్య‌త‌లు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Nara Lokesh | ఏపీ రాజ‌కీయాల‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూట‌మి ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది.

    అయితే ఈ సారి టీడీపీ తొలి మహానాడు(Mahanadu)కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. టీడీపీలో నారా లోకేష్(Nara Lokesh)కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవనుంది. ప్రభుత్వంలో ప్రమోషన్ కు సమయం ఉండటంతో.. ముందుగా పార్టీలో ప్రమోషన్ దాదాపు ఖరారైంది. టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికి నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పుడు మరో తరంలోకి పార్టీ మారాల్సిన సమయం వచ్చిందన్న అభిప్రాయం క్యాడర్లో వినిపిస్తోంది.

    Nara Lokesh | మ‌హానాడు వేదిక‌గా..

    ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు Chandra babu పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన సూపర్ విజన్ చేస్తూ కొత్త తరానికి బాధ్యతలు అందించాల్సిన సమయం వచ్చింది.తెలుగుదేశం పార్టీ(Telugu Desham Party)కి బలం యువ నాయకత్వం. వారసత్వం మాత్రమే కాదు ప్రతిభ కూడా ఉందని నిరూపించుకున్న నేతలు టీడీపీలో ఉన్నారు. నారా లోకేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆయన మొదటి నుంచి పార్టీకి అంతర్గతంగా పని చేస్తూ వచ్చారు. మంత్రి లోకేష్ కు పార్టీలో – ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంత కాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది.

    డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ పైన జనసేన నేతలు విభేదించారు. దీంతో, ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.

    తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును నారా లోకేష్(Nara Lokesh) కు ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా ఉంది. నారా లోకేష్ అటు ఢిల్లీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ ను Nara Lokesh వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేస్తే టీడీపీని నడిపించే తర్వాత తరం ప్రతి జిల్లాలోనూ బలంగా తయారవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

    టీడీపీ క్యాడర్ మహానాడు(TDP Cadre Mahanadu)లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ కొత్త తరంలోకి టీడీపీని తీసుకెళ్లే మహానాడుగా.. కడప మహానాడు mahanadu kadapa చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. అందుకే నారా లోకేష్‌కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

    Latest articles

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    More like this

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...