అక్షర టుడే, వెబ్‌డెస్క్: Lokah | మలయాళ చిత్ర పరిశ్రమలో (Malayalam film industry) సూపర్‌హీరో సినిమాగా వచ్చి చారిత్రక విజయాన్ని అందుకున్న చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర (Lokah Chapter 1:Chandra)(కొత్త లోక). ఆగస్టు 28, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.250 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన OTT రైట్స్ డీల్ మరోసారి సినిమా బిజినెస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, ఈ సినిమాకు OTT రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
Lokah | ఊచకోత
అంటే, కేవలం OTT హక్కులతోనే నిర్మాతలు లాభాల్లోకి వెళ్లిపోయినట్లు స్పష్టమవుతోంది. అయితే, సినిమా థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందున, అక్టోబర్ లో మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తన సొంత బ్యానర్ అయిన వేఫారర్ ఫిలిమ్స్ (Wayfarer Films) ద్వారా నిర్మించారు. దర్శకుడు డొమినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లెన్ (Naaslen), శాండీ కీలక పాత్రల్లో నటించారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా దుల్కర్ సల్మాన్ మరియు టోవినో థామస్ క్యామియోలు కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.
రిలీజ్ అయిన తర్వాత చాలా పాజిటివ్ మౌత్ టాక్‌ను (Mouth talk) తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కంటెంట్, విజువల్స్, ఎమోషనల్ కంటెక్ట్‌తో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్ కూడా ‘లోకను ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే చిత్రంగా నిలిపింది. 15 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది అంటే మూవీ ప్రేక్షకలకి ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థియేటర్స్‌లో అదరగొడుతున్న ఈ చిత్రం ఓటీటీలోను మంచి టాక్ సంపాదించుకోవడం ఖాయం.