అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జిల్లా వ్యాప్తంగా వచ్చేనెలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ జీవీఎన్ భరత లక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో గురువారం మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో బీమా కంపెనీలు, న్యాయవాదులు కేసులను రాజీ కుదిర్చే విధంగా ప్రయత్నిస్తే కక్షిదారులకు న్యాయం చేసిన వారమవుతామన్నారు. లోక్‌అదాలత్‌ను నడిపించేది న్యాయమూర్తులు, న్యాయవాదులేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు జిల్లా జడ్జి హరీష, న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్‌రావు, బీమా కంపెనీల తరపున న్యాయవాదులు గోవర్ధన్, ఆనంద్‌రెడ్డి, అంకిత, గణేశ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
6