అక్షరటుడే, భీమ్‌గల్ : Mla Prashanth Reddy | ఆపదలో ఉండి వైద్యచికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న ఇద్దరు బాధితులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Mla Prashanth Reddy) సాయం అందించారు. వారిద్దరికి ఎల్వోసీలు అందించారు.
Mla Prashanth Reddy | హైదరాబాద్‌లోని తన నివాసంలో..
బాల్కొండ నియోజకవర్గానికి (Balkonda constituency) చెందిన ఇద్దరు బాధితులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో (NIMS) చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం వారు ఎమ్మెల్యేను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుంచి ఎల్వోసీలు మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధితుల కుటుంబ సభ్యులకు వీటిని స్వయంగా అందజేశారు.
Mla Prashanth Reddy | ఎల్వోసీలు అందుకున్నవారు..
ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన తనుష్ గౌడ్ చికిత్స నిమిత్తం రూ. 2,00,000 విలువైన ఎల్వోసీని అందజేశారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఫాతే అహ్మద్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష విలువైన ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో స్పందించి, మెరుగైన వైద్యం అందేలా సహకరించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తమ పట్ల మానవీయ కోణంలో స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.