అక్షరటుడే, వెబ్డెస్క్ : Influenza Virus | కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో జన జీవితం పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చాలా చోట్ల లాక్‌డౌన్ విధించారు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ తప్పదా అనే ప్రశ్న తలెత్తుతుంది.
తాజా సమాచారం ప్రకారం, జపాన్ మరియు మలేషియా (Malaysia)లో ఇన్‌ఫ్లుఎంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.జపాన్‌లో ఇటీవల ఇన్‌ఫ్లుఎంజా కేసులు (Influenza Cases)రికార్డు స్థాయిలో పెరగడంతో, అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. నిపుణుల హెచ్చరికల ప్రకారం, వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Influenza Virus | లాక్‌డౌన్ భయం..
ఇప్పటికే ఆస్పత్రులు రోగులతో నిండిపోగా, పాఠశాలలు, మార్కెట్లు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఫ్లూ బారిన పడుతున్నారు. జపాన్ ప్రభుత్వం (Japanese Government)కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.అంతేకాక, మలేషియాలో కూడా ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. మలేషియా అధికారులు దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసి, విద్యార్థులు ఒక వారం పాటు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. జాతీయ సిజిల్ పెలాజరన్ మలేషియా (SPM) పరీక్షల సమయానికి ముందే పాఠశాలలను మూసివేయడానికి కారణం వైరస్ వ్యాప్తిని అరికట్టడం అని విద్యామంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మోహమ్మద్ అజామ్ అహ్మద్ తెలిపారు.
ప్రస్తుతం దాదాపు 6,000 మంది విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. ఇన్‌ఫ్లుఎంజా (Influenza Virus)సోకిన వారు 5–7 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆరోగ్య అధికారులు సూచించారు. మలేషియా ప్రభుత్వం ప్రకారం, COVID-19 తర్వాత ఎదురైన అత్యంత విస్తృతమైన వైరల్ వ్యాప్తి ఇదే. పరిస్థితి మరింత విపరీతమైతే, దేశంలోని ఇతర రంగాలకు కూడా హాలిడేలు ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు పరిగణనలోకి తీసుకోనట్లయితే, జపాన్, మలేషియాలో కోవిడ్ తరహా పరిస్థితులు మళ్ళీ రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.