అక్షరటుడే, హైదరాబాద్: Lockdown in Hyderabad | భారత్ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు ఘటనతో నిఘా సంస్థలు Intelligence agencies దేశవ్యాప్తంగా హై అలర్ట్ high alert ప్రకటించాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్లేస్లో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు చోటుచేసుకుంది.
ఎర్రకోట గేట్ నంబరు 1 వద్ద జరిగిన పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
పదుల సంఖ్యలో గాయపడ్డారు. LNJP ఆసుపత్రి (LNJP Hospital) లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఎర్రకోట పేలుడు ఘటనతో హైదరాబాద్, ముంబయి Mumbai సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah సమీక్షించారు.
భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను అమిత్ షా ఆదేశించారు. ఘటనాస్థలికి NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్ National Security Guard), NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ National Investigation Agency) బాంబు స్క్వాడ్ bomb squad బృందాలు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.
Lockdown in Hyderabad | భద్రత కట్టుదిట్టం..
హైదరాబాద్ Hyderabad మహా నగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘నాకా బందీ’ Naka Bandi (అన్ని వైపులా దిగ్బంధనం) ఏర్పాటు చేశారు.
రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100 కి సమాచారం అందించాలని నగర ప్రజలకు సీపీ సజ్జనార్ సూచించారు.
