ePaper
More
    HomeతెలంగాణSub Registrar Office | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి తాళం.. ఎందుకంటే..?

    Sub Registrar Office | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి తాళం.. ఎందుకంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sub Registrar Office | రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే రెవెన్యూ శాఖ(Revenue Department) ఎంతో కీలకమైంది. సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. అయినా ప్రభుత్వాలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (Registrar Offices) కనీస వసతులు కల్పించడం లేదు. పలు ప్రాంతాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఆయా ఆఫీసుల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​కు భవన యజమాని తాళం వేశాడు.

    Sub Registrar Office | పెండింగ్​లో 40 నెలల అద్దె

    రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిధుల లేమితో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు, పాఠశాలలకు నిధులు చెల్లించడం లేదు. దీంతో భవన యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అద్దె చెల్లించడం లేదని రంగారెడ్డి జిల్లా(Rangareddy District) అబ్దుల్లాపూర్‌మెట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశాడు. 40 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడం గమనార్హం. అద్దె విషయంపై డిస్ట్రిక్‌ రిజిస్ట్రార్‌(District Registrar)కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సోమవారం సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి తాళం వేశాడు. దీంతో కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.

    READ ALSO  Collector Kamareddy | ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలి

    Sub Registrar Office | గురుకుల పాఠశాలలకు..

    రాష్ట్ర ప్రభుత్వం పలు గురుకుల పాఠశాలలను అద్దె భవనాల్లో కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వాటి బకాయిలు కూడా పేరుకుపోయాయి. దీంతో పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా జూన్​ 12న పలు పాఠశాల భవనాలకు యజమానులు తాళాలు వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో భవన యజమానులు తాళాలు తీశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా.. అద్దె బకాయిలు మాత్రం ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...

    Mla Pocharam | శాంతి దూత ఏసుప్రభువు: ఎమ్మెల్యే పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు(Jesus Christ)అని ప్రభుత్వ...

    Parliament Sessions | పార్ల‌మెంట్‌లో వాయిదాల ప‌ర్వం.. నిమిషానికి రూ.2.50 ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం వృథా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య...

    Tamil Nadu | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన మూడేళ్ల కూతురు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. తాత్కాలిక ఆనందాలు, సుఖాల కోసం కొందరు...

    More like this