HomeUncategorizedBank Recruitment | బీవోబీలో లోకల్​ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా..

Bank Recruitment | బీవోబీలో లోకల్​ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bank Recruitment | లోకల్‌ ఆఫీసర్‌(Local officer) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank Of Baroda) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 24వ తేదీ వరకు గడువుంది. రెగ్యులర్‌(Regular) ప్రాతిపదికన నియమించే ఈ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 2,500
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(Degree) పూర్తి చేసి ఉండాలి. ఏదైనా కమర్షియల్‌ లేదా రీజినల్‌ రూరల్‌ బ్యాంకులో కనీసం ఏడాది బ్యాంకింగ్‌(Banking) అనుభవమున్నవారు అర్హులు.

వయో పరిమితి : జులై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు నిండి, 30 ఏళ్లు దాటనివారు అర్హులు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

వేతన శ్రేణి : నెలకు రూ.48,480 నుంచి రూ.85,920. దీనికి అలవెన్సులు అదనం.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది : ఈనెల 24.

ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకోసం https://www.bankofbaroda.in/career లో సంప్రదించండి.

Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook