ePaper
More
    HomeతెలంగాణMinister Sridhar Babu | 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక...

    Minister Sridhar Babu | 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Sridhar Babu | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని కాంగ్రెస్​ ప్రకటించిన విషయం తెలిసిందే.

    అయితే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపినా.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ (Odinance)​ తీసుకు రావాలని గవర్నర్​ ఆమోదం కోసం పంపింది. అయితే ఆయన కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వకపోవడంతో స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) రిజర్వేషన్​పై అయోమయం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి శ్రీధర్​బాబు బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

    కరీంనగర్‌లో (Karimnagar) సుడా కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం మంత్రి శ్రీధర్​బాబు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి (BJP) చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బిల్లులను ఆమోదించని ప్రభుత్వం.. ఆర్డినెన్స్​ను కూడా ఆపుతోందని విమర్శించారు. బీసీలకు అభ్యున్నతికి త పార్టీ కట్టుబడి ఉందని.. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

    Minister Sridhar Babu | అనర్హతపై స్పీకర్​దే నిర్ణయం

    బీఆర్​ఎస్​ (BRS) నుంచి గెలుపొంది కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్​దే తుది నిర్ణయమని మంత్రి స్పష్టం చేశారు. మూడు నెలల్లోగా స్పీకర్​ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ప్రకటించిన విషయం తెలిసిందే. అనర్హత విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం నివేదికపై ఎన్​డీఎస్​ఏ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామన్నారు.

    Latest articles

    Stock Makert | బుల్స్‌ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Makert | యూఎస్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మొదట...

    Kamareddy | ఓట్ల దొంగ‌త‌నం.. ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం : డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం.. ప్రజాస్వామ్యానికి అవమానమని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్...

    National level athletics | జాతీయస్థాయి అథ్లెటిక్స్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: National level athletics | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (athletics) పోటీల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా...

    Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి : కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా...

    More like this