ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | త్వరలో పంచాయతీ ఎన్నికలు!

    Local Body Elections | త్వరలో పంచాయతీ ఎన్నికలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికల panchayat elections సందడి మొదలు కానున్నట్లు సమాచారం. తెలంగాణలో సర్పంచుల sarpanch పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసిపోయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధిరుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. అయితే నిధులు లేకపోవడం.. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.

    Local Body Elections | గతంలోనే పెట్టాలనుకున్నా..

    ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నిలు పెట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఎన్నికల కమిషన్​ election commission కూడా ఓటర్ల జాబితా విడుదల చేసింది. అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే అనివార్య కారణాలతో అప్పుడు ఎన్నికల నిర్వాహణ వాయిదా పడింది. దీంతో తాజాగా జూన్​ లేదా జులైలోపు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

    Local Body Elections | బిల్లుల చెల్లింపుతో చర్చ

    గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా పెండింగ్​లో ఉన్న బిల్లులను pending bills తాజాగా ప్రభుత్వం విడుదల చేయడం స్థానిక ఎన్నికలపై చర్చకు దారితీసింది. కొంతకాలంగా ప్రభుత్వం పంచాయతీల పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు చేయలేదు. దీంతో ఎంతో మంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. పలువురు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.

    అయితే ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామ పంచాయతీల grama panchayats కు పెండింగ్​లో ఉన్న బిల్లుల్లో రూ.153 కోట్లు విడుదల చేసింది. ఒకే రోజు 9,990 బిల్లులు క్లియర్‌ చేయడం గమనార్హం. రూ.పది లక్షల లోపు ఉన్న బిల్లును ఒకే విడతలో సర్కార్​ విడుదల చేసింది. మరో రూ.300 కోట్ల బిల్లులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల కోసమే బిల్లులు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

    Local Body Elections | వరుసగా ఎన్నికలు

    ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. జూన్​ చివరి వారంలో ఎన్నికలు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అనంతరం వెనువెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత మున్సిపల్​ ఎన్నికల తంతు ముగించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులకు కూడా మౌఖికంగా ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

    Local Body Elections | జోరుగా పథకాల అమలు

    రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న పథకాలను ప్రభుత్వం ప్రస్తుతం వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం indiramma housing scheme లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి మంజూరు పత్రాలు ఇచ్చి పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే కొత్త రేషన్​ కార్డులను new ration cards కూడా త్వరలో ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది.

    ఇప్పటికే రేషన్​ కార్డుల్లో లబ్ధిదారులను అధికారులు యాడ్​ చేస్తున్నారు. పలువురి పేర్లు పాత కార్డుల్లో చేర్చగా పరిశీలించుకుంటూ మిగతా వారి పేర్లు నమోదు చేస్తున్నారు. అనంతరం కొత్త కార్డులు కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే రాజీవ్​ యువ వికాసం rajiv yuva vikasam పథకాన్ని కూడా జూన్​ 2న ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీపై లోన్లు అందించనున్నారు. స్థానిక ఎన్నికల కోసమే ప్రభుత్వం పథకాల అమలులో వేగం పెంచిందనే చర్చ జరుగుతోంది.

    Local Body Elections | సీఎం పర్యటనలు

    సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy ఇటీవల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు కేడర్​ను సమాయత్తం చేయడానికే ఆయన పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం సీఎం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.

    Local Body Elections | రిజర్వేషన్లపై సందిగ్దత

    కాంగ్రెస్ congress తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు bs reservations ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీసీ కులగణన caste census చేపట్టిన ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. కేంద్రం ఆ బిల్లును పార్లమెంట్​లో ఆమోదిస్తేనే బీసీ రిజర్వేషన్​ సాధ్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పట్లో పార్లమెంట్​ సమావేశాలు లేవు. దీంతో రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా ముందుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున 42శాతం టికెట్లు బీసీలకు కేటాయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అలా చేస్తే మిగతా పార్టీలు కూడా బీసీలకు టికెట్లు ఇస్తాయని లేదంటే.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయా పార్టీల వైఖరిని ఎండగట్టొచ్చని కాంగ్రెస్​ భావిస్తోంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...