Homeతాజావార్తలుLocal body elections | నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు.. రేపటి క్యాబినెట్​లో నిర్ణయం!

Local body elections | నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు.. రేపటి క్యాబినెట్​లో నిర్ణయం!

Local body elections : తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబరులో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Local body elections : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబరులో మళ్లీ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు గురువారం (అక్టోబరు 23) మంత్రివర్గ cabinet సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్..  గత నెల 17న విచారణకు వచ్చింది.

ఆ సమయంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు High Court వివరణ కోరింది. ఈ మేరకు రెండు వారాల్లో చెబుతామని సర్కారు గడువు కోరింది.

అయితే నవంబరు 1వ తేదీ లోపు ఎన్నికల నిర్వహణ విషయం న్యాయస్థానానికి తెలపాల్సి ఉంటుంది. దీనికితోడు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి  ఉంది.

Local body elections | కేబినెట్ మీటింగ్​లో కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలో గురువారం జరిగే కేబినెట్ cabinet మీటింగ్​లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఎలక్షన్​ కమిషన్​ Election Commission విడుదల చేసిన షెడ్యూల్​లో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కేటాయించింది. ఈ మేరకు 9వ నంబరు జీవోను జారీ చేసింది.

కాగా, ఈ జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈసీ కూడా నోటిఫికేషన్​ను రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ షెడ్యూల్​ను జారీ చేయాల్సి ఉంటుంది.