అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ ప్రారంభం అయింది. పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు.
ప్రజాపాలన వారోత్సవాల అనంతరం స్థానిక ఎన్నికలు సెడ్యూల్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా వీటిని నిర్వహిస్తున్నారు. అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి మంత్రివర్గం ఓకే చెప్పింది. దీంతో డిసెంబర్ రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్, జనవరిలో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అయిపోయాక.. దీనిపై వివరాలు వెల్లడించనున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం మంత్రివర్గం తీసుకుంది. రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పత్తి కొనుగోలు విషయంలో సీఐఐ నిబంధనలపై సైతం చర్చించారు. అలాగే సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయం నిర్ణయించింది.
