HomeతెలంగాణLocal body election schedule | నేడే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​!

Local body election schedule | నేడే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​!

అక్షరటుడే, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC), సర్పంచి (Sarpanch) స్థానాల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (సెప్టెంబరు 29) షెడ్యూల్ విడుదల చేయనుంది.

షెడ్యూల్​ ప్రకటించగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వస్తుంది. ఇక ఎలక్షన్​ విషయానికి వస్తే.. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచి ఎన్నికలు ఉంటాయి.

రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యులు, జడ్పీ ఛైర్మన్​ పదవుల రిజర్వేషన్ల గెజిట్​ను తెలంగాణ సర్కారు ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది.

Local body election schedule | హైకోర్టులో రిజర్వేషన్ల అంశం

ఈ గెజిట్​ను పరిశీలించిన ఈసీ.. తదుపరి ఎలక్షన్​ ప్రణాళికను సిద్ధం చేసింది. కాగా, రిజర్వేషన్ల విషయం హైకోర్టులో ఉండటంతో రాష్ట్ర ఎలక్షన్​ కమిషన్​కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులపై ఈసీ ముందే చర్చించినట్లు సమాచారం. అడ్వొకేట్ జనరల్ సలహా సైతం తీసుకున్నట్లు సమాచారం.

హైకోర్టు విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఆ తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

దశల వారీగా ఎన్నికలు జరిపేలా ప్రణాళిక రూపొందినట్లు సమాచారం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ను రెండు దశల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత సర్పంచి ఎలక్షన్స్ సైతం కొన్ని జిల్లాల్లో రెండు, మరికొన్ని చోట్ల మూడు దశల్లో జరిపే అవకాశం ఉంది. హైకోర్టు నుంచి ఆటంకాలు రాకపోతే నవంబరు 10 – 15 లోపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి స్థానాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి.

 

Must Read
Related News