అక్షరటుడే, హైదరాబాద్: Local body election notification | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు High Court ఆదేశాల మేరకు నోటిఫికేషన్ను నిలిపి వేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ Model Code of Conduct నిలిచిపోయింది.
Local body election notification |
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు జీవో 9 (GO 9) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ తర్వాత అక్టోబరు 9వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, సర్కారు జారీ చేసిన జీవో సరికాదంటూ.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవో ఆధారంగా ప్రకటించిన ఎలక్షన్ నోటిఫికేషన్పైనా స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎలక్షన్ నోటిఫికేషన్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు వేసిన నామినేషన్లు చెల్లవు. ఈసీ Election Commission తదుపరి ప్రకటన election notification విడుదల చేసే వరకు ఎన్నికలు ఉండవు.