ePaper
More
    HomeతెలంగాణLocal body election | సర్పంచ్‌ ఎన్నికలపై సర్కారు కీలక నిర్ణయం..

    Local body election | సర్పంచ్‌ ఎన్నికలపై సర్కారు కీలక నిర్ణయం..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Local body election | రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం తెలంగాణ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలపడమే కాకుండా ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. దీంతో అతి త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది.

    రాష్ట్రంలో సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడిచింది. దీంతో లోకల్‌ బాడీ ఎన్నికలపై గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 2న ఓటరు తుది జాబితాను విడుదల చేయనుంది. కాగా.. ఇదే సమయంలో శనివారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఆమోదం తెలిపింది.

    Local body election | త్వరలోనే నోటిఫికేషన్‌..

    స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. జిల్లాల వారీగా బ్యాలెట్‌ బ్యాక్సుల పంపిణీ పూర్తయింది. సిబ్బంది వివరాలను సైతం సేకరించిన ఎన్నికల సంఘం.. తుది ఓటరు జాబితాను విడుదల చేయడమే తరువాయిగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు మొదటి వారంలోనే లోకల్‌ బాడీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అయితే ముందుగా సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతుందా? అనేది ఇంకా స్పష్టత లేదు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this