అక్షరటుడే, హైదరాబాద్: local bodies Reservations | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ (BC) లకు 42 బీసీ రిజర్వేషన్లు reservations కల్పిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.
అదే సమయంలో జడ్పీ ZP, ఎంపీపీ (MPP) లు, జడ్పీటీసీ (ZPTC) లు, ఎంపీటీసీ (MPTC) స్థానాల వారీగా కూడా రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనిపై నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఏయే స్థానాలు ఏ సామాజికవర్గానికి కేటాయిస్తారన్న దానిపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
local bodies Reservations | హైకోర్టు ఆదేశాల మేరకు..
స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర దాటిపోయింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపకపోవడంతో కొంత మంది హైకోర్టు (High Court) ను ఆశ్రయించింది.
దీంతో సెప్టెంబరు 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని న్యాయస్థానం సర్కారును ఆదేశించింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై చిక్కుముడి పడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో పడిపోయింది.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగులో ఉంది. కాగా, ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది.
ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుముఖత తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది.
ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలను సిద్ధం చేసిన ఈసీ (State Election Commission – EC).. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడగానే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
local bodies Reservations | రిజర్వేషన్లు ఖరారు..
మరోవైపు, ప్రభుత్వం జడ్పీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచి పదవులకు స్థానాల వారీగా రిజర్వేషన్లను సూత్రప్రాయంగా ఖరారు చేసింది. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది.
రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కలెక్టర్లకు అప్పగించింది.
జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. జనాభా, సామాజికవర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు.
కలెక్టర్ల నివేదికల ఆధారంగా జడ్పీ, ఎంపీపీ, సర్పంచి, ఎంపీటీసీ పదవులకు రిజర్వేషన్లను సర్కారు ఖరారు చేసింది. జడ్పీ ఛైర్మన్ పదవులకు సామాజికర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
అలాగే, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచులు, వార్డుల వారీగా వివిధ వర్గాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.