ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశాం : సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశాం : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రూ.రెండు లక్షలలోపు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్​ (BRS) రెండు సార్లు రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. మొదటి సారి బీఆర్​ఎస్​ మాఫీ చేసిన సొమ్ము మిత్తికి కూడా సరిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

    CM Revanth Reddy | రైతుల సంక్షేమమే ధ్యేయం

    రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు (government goal). వ్యవసాయాన్ని పండుగ చేయడానికి అనేక సంక్షేమ పథకాలు (welfare schemes) అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు మద్దతు ఇవ్వకుంటే ఎవరు కూడా అధికారంలోకి రాలేరని సీఎం అన్నారు. వార్డు మెంబర్​ నుంచి సీఎం వరకు ఎవరు గెలవాలన్నా రైతుల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.

    CM Revanth Reddy | బిల్లులు పెండింగ్​ పెట్టింది గత ప్రభుత్వమే..

    రాష్ట్రంలో సర్పంచులకు బిల్లులు పెండింగ్​లో (pending bills) పెట్టింది గత ప్రభుత్వమే అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తాను సీఎం అయ్యే నాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో అరాచక పాలన చేశారన్నారు. భార్యాభర్తలు కూడా ఫోన్‌లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.

    CM Revanth Reddy | కూరగాయలు పండించాలి

    హైదరాబాద్ (Hyderabad) చుట్టూ ఉన్న రైతులు కూరగాయలు సాగు చేయాలని, పండ్ల తోటలు పెంచాలని సీఎం సూచించారు. అగ్రికల్చర్​ విద్యార్థులు (agriculture students) గ్రామాలకు వెళ్లి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అందరూ ఒకే పంట వేస్తే తినే వారు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రకాల పంటలు సాగు చేసి లాభాలు పొందాలని సూచించారు.

    CM Revanth Reddy | వరి వేసుకుంటే ఉరే అన్నారు

    బీఆర్​ఎస్​ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ (KCR) వరి వేసుకుంటే ఉరే అని చెప్పారన్నారు. కానీ కేసీఆర్​ మాత్రం వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు చేశారని రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర ఇస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇస్తున్నట్లు తెలిపారు. రేషన్​ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

    CM Revanth Reddy | తొమ్మిది రోజుల్లో రైతు భరోసా అందిస్తాం..

    తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం నుంచే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఈ మేరకు సీఎం రైతు భరోసా నిధులు విడుదల చేశారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కోటి 49 లక్షల 35 వేల ఎకరాలకు రైతు భరోసా నిధులు (Rythu Bharosa Funds) వేస్తామని పేర్కొన్నారు. పరిమితి లేకుండా అర్హులైన ప్రతిరైతుకు రైతు భరోసా ఇస్తామని ఆయన తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...