అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ బిర్యానీ Biryani ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలో బిర్యానీ హోటల్స్(Biryani Hotels), రెస్టారెంట్స్(Restaurants) అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొంత మంది జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టమొచ్చినట్టు బిర్యానీ తయారు చేస్తుంటారు. ఒక్కోసారి బిర్యానీలో బల్లులు, బొద్దింకలు, పురుగులు, ఏవేవో దర్శనం ఇస్తుంటాయి. ఆ మధ్య హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే బావర్చి హోటల్(Bavarchi Hotel) లో బల్లి ప్రత్యక్షం అయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ హోటల్ చికెన్, మటన్ బిర్యానీకి చాలా ఫేమస్. అయితే అక్కడి నుంచి తెప్పించుకున్న చికెన్ బిర్యానీలో బల్లి(Lizard) ప్రత్యక్షమైందని ఒక కస్టమర్ ఆందోళనకు దిగాడు. ఆన్‌లైన్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, డెలివరీ బాయ్ తీసుకువచ్చిన చికెన్ బిర్యానిలో బల్లి వచ్చిందని గుర్తించాడు.
Hyderabad | బల్లి ఫ్రై అయిందట..
ఈ విషయాన్ని బావర్చి యాజమాన్యానికి(Bavarchi Management) తెలియజేశామని.. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ఆ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని ఓ రెస్టారెంట్‌లో Restaurant కస్టమర్ తింటున్న బిర్యానీలో బల్లి దర్శనమివ్వడంతో షాక్ అయ్యాడు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్ రహదారిలోని మెహఫిల్ రెస్టారెంట్(Mehfil Restaurant)కు వెళ్లాడు. కాగా, ఆయన తింటున్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడు రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించాడు. ఏమైతుంది.. బల్లి మంచిగా ఫ్రై అయ్యిందిగా తిను అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు.
అంతేకాకుండా రెస్టారెంట్ యజమాని(Restaurant Owner) కృష్ణారెడ్డి ఏమి చేసుకుంటావో చేసుకో అనే విధంగా దురుసుగా మాట్లాడాడట. దీంతో వెంటనే కస్టమర్.. డయల్ 100కు ఫోన్ చేశాడు. రెస్టారెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు Police వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. దీంతో అప్రమత్తమైన రెస్టారెంట్ యజమాని దానికి తాళం వేసి పరారైనట్లు సమాచారం. కాగా, గతంలో ఇలా బల్లులు, బొద్దింకలతో కూడా బిర్యాని తిని వాంతులు చేసుకోవడం మనం చూశాం. ఏది ఏమైన బయట తినే ఫుడ్ విషయంలో ఆచితూచి వ్యవహరించడడం మంచిది.