అక్షరటుడే, మెండోరా: Bathukamma celebrations | మండలంలోని పోచంపాడ్ ప్రాజెక్టులో ఉన్న లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో (Little Flower School) శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు (Telangana culture and traditions) నిలువెత్తు నిదర్శనం, బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ అన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను మహిళలు అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. బతకమ్మ పండుగతోనే ప్రతిఇంట్లో సుఖ సంతోషాలు పాడి పంటలు సమృద్ధిగా విరాజిల్లుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శివరాం ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.