Homeజిల్లాలునిజామాబాద్​Vijay School | తల్లిదండ్రులు, గురువుల మాట వింటే మంచి భవిష్యత్​

Vijay School | తల్లిదండ్రులు, గురువుల మాట వింటే మంచి భవిష్యత్​

Vijay School | నగరంలోని విజయ్​ పాఠశాల టాలెంట్​ షో మంగళవారం నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Vijay School | తల్లిదండ్రులు, గురువుల మాట వింటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ప్లే బ్యాక్ సింగర్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ (Little Musicians Academy) వ్యవస్థాపకుడు డాక్టర్ రామాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ్​ పాఠశాల టాలెంట్ షో మంగళవారం నిర్వహించారు.

రామాచారి మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా పాఠశాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు పాఠశాల కోవెల లాంటిది అన్నారు. టాలెంట్ షోని చూస్తే పండగ వాతావరణం నెలకొందని, ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల ప్రతిభ బయట పడుతుందన్నారు. అనంతరం జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమన్నారు. శ్రద్ధగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ అమృత లత (Dr. Amrutha Latha) రచయితగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా ఎందరో మంది విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.

Vijay School | ఆకట్టుకున్న ప్రదర్శనలు

టాలెంట్ షోలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా సాంప్రదాయ, జానపద నృత్యాలు అలరించాయి. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నటి, శాస్త్రీయ నృత్య కళాకారిణి సరస్వతి, పాఠశాల కార్యదర్శి డాక్టర్ అమృతలత, రమాదేవి, లలితా దేవి, విజయభారతి, విజయలక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపాల్ విజేత తదితరులు పాల్గొన్నారు.