ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNavodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

    Navodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Navodaya Vidyalaya | నిజామాబాద్​లో నూతనంగా ఏర్పాటైన నవోదయ విద్యాలయంలో (Nizamabad Navodaya vidyalaya) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం ప్రకటించారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం 40 మందిని ఎంపిక చేసినట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ మను యోహన్నన్​ తెలిపారు.

    Navodaya Vidyalaya | 14వ తేదీ నుంచి అడ్మిషన్లు..

    నవోదయలో ఈనెల 14వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు చెప్పారు.

    Navodaya Vidyalaya | జనవరిలో పరీక్ష..

    ఈ ఏడాది జనవరి 18న నవోదయ పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్​కు సుమారు 6,090 మంది హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే 80 మంది విద్యార్థులు నిజాంసాగర్​ నవోదయకు అర్హత సాధించారు. తాజాగా నిజామాబాద్​లో ఏర్పాటైన నవోదయ పాఠశాలకు 40మందిని ఎంపిక చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.

    ఎంపికైన విద్యార్థుల హాల్​టిక్కెట్​ నంబర్లు ఇవే..

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...