AP | మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా.. రోడ్డుపై మద్యం సీసాల కోసం పోటెత్తిన జనం!
AP | మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా.. రోడ్డుపై మద్యం సీసాల కోసం పోటెత్తిన జనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP : అచ్యుతాపురం మండలం(Achyutapuram mandal)లోని అరిపాలెం గ్రామం వద్ద మద్యం సీసాలు తరలిస్తున్న ప్రైవేట్ వాహనం vehicle అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డుపై మద్యం సీసాలు Liquor చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ప్రయాణికులు రోడ్డుపై పడిన మద్యం సీసాలను ఏరుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు వాహనాలు గంటలపాటు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

AP : ఏంటి ఈ జ‌నం…

పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని జనాన్ని అక్కడి నుంచి తరిమేశారు. బోల్తా పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తీయించి ట్రాఫిక్‌నుTraffic మామూలు స్థితికి తీసుకువచ్చారు. ప్రాథమికంగా మద్యం లారీలో వాణిజ్య రవాణా కోసం అనుమతులు లేకుండా తరలింపు జరగడంతో, వాహనం ఓనరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు.