Homeజిల్లాలుకామారెడ్డిExcise Department | మద్యం టెండర్ల గడువు తేదీ పెంపు

Excise Department | మద్యం టెండర్ల గడువు తేదీ పెంపు

మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు కామారెడ్డి ఎక్సైజ్​ శాఖ అధికారి హన్మంత్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Excise Department | జిల్లాలో 49 మద్యం దుకాణాలకు టెండర్లు వేయడానికి ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే ఈనెల 18 వరకే గడువు ఉండడంతో ప్రభుత్వం గడువు మరొక ఐదు రోజులు పెంచిందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి హన్మంత్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Excise Department | ఈనెల 23వ తేదీ వరకు..

ఈనెల 23 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని, 27న లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ఉంటుందని హన్మంత్​రావు పేర్కొన్నారు. జిల్లాలో శనివారం రాత్రి వరకు మద్యం టెండర్లకు మొత్తం 1,444 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఇందులో కామారెడ్డి (Kamareddy) పరిధిలో 449, దోమకొండ పరిధిలో 307, బిచ్కుంద పరిధిలో 222, బాన్సువాడ పరిధిలో 240, ఎల్లారెడ్డి పరిధిలో 226 దరఖాస్తులు వచ్చాయన్నారు. టెండర్ వేయడానికి ప్రభుత్వం గడువు పెంచినందున ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.