Homeజిల్లాలుకొమరం భీం ఆసిఫాబాద్Asifabad | రోడ్డుపై ఏరులై పారిన మద్యం.. ఎందుకో తెలుసా?

Asifabad | రోడ్డుపై ఏరులై పారిన మద్యం.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asifabad | ఒక్క మద్యం సీసా నేలపాలైతేనే మందుబాబుల గుండె తరుక్కుపోతుంది. అలాంటిది రోడ్డుపై మద్యం ఏరులై పారితే ఎంతో వేదనకు గురి అవుతారు. కుమురం భీం ఆసిఫాబాద్(Asifabad)​ జిల్లాలో రోడ్డుపై మద్యం ఏరులై పారింది.

అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. అనంతరం దానిని ధ్వంసం చేస్తారు. తాజాగా ఆసిఫాబాద్​ జిల్లాలో ఏకంగా రూ.21 లక్షల విలువైన మద్యం బాటిళ్లను (Liquor Bottles) ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సమయంలో చింతలమానేపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పోలీస్​ స్టేషన్​లో నిల్వ చేశారు. తాజాగా ఎస్పీ కాంతిలాల్ ఆధ్వర్యంలో ఆ మందు బాటిళ్లను రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు.