ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిillegal Liquor Sales | బార్లను తలపిస్తున్న దాబాలు.. పట్టించుకోని అధికారులు

    illegal Liquor Sales | బార్లను తలపిస్తున్న దాబాలు.. పట్టించుకోని అధికారులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Jukkal Constituency | జిల్లాలోని పలు దాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు (Liquor sales) జరుపుతున్నారు. దాబాలు (Dhabas), హోటళ్లలో (Hotels) మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. అయినా నిర్వాహకులు మద్యం అమ్మడమే కాకుండా.. ఏకంగా టేబుళ్లు ఏర్పాటు చేసి మందుబాబులకు సకల వసతులు కల్పిస్తున్నారు. గతంలో తనిఖీలు జరిపి కేసులు నమోదు చేసిన ఎక్సైజ్​, పోలీసు అధికారులు (Excise Officers) తిరిగి ‘మామూలు’గానే తీసుకుంటున్నారు.

    జుక్కల్​ నియోజకవర్గంలో (jukkal constituency) ఉన్న దాబాల్లో నిత్యం మద్యం విక్రయాలు జరుపుతున్నారు. దర్జాగా మద్యం తాగేందుకు పర్మిషన్ ఇవ్వడమతో ఏకంగా దాబాలు బార్లను తలపిస్తున్నాయి. అలాగే మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. నిర్వాహకులు (Dhaba Owners) మందుబాబుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినా.. సంబంధిత అధికారులు చోద్యం చూడడం గమనార్హం.

    Illegal Liquor sales | వరుస రోడ్డు ప్రమాదాలు

    దాబాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం తాగేందుకు అనుమతిస్తున్నారు. ఫలితంగా యువతతో పాటు పలువురు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన, జాతీయ రహదారుల పైనే ఉన్న దాబాల్లో ఈ పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

    దాబాల్లో మద్యం అమ్మకాలు చేసుకోవడానికి ఎక్సైజ్ అధికారులే (Excise Officers) అంధికారికంగా అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జిల్లా వ్యాప్తంగా దాబాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. మద్యం సిట్టింగ్ నడిపిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తిరిగి పరిస్థితి ఎప్పటిలాగే మారినప్పటికీ.. పోలీసులు మాత్రం రోడ్లపై డ్రంకన్​ డ్రైవ్ (Drunk and Drive)​ తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...