Homeతాజావార్తలుLiquor Shops Lucky Draw | రేపు మద్యం షాపులకు లక్కీ డ్రా.. అక్కడ తీవ్ర...

Liquor Shops Lucky Draw | రేపు మద్యం షాపులకు లక్కీ డ్రా.. అక్కడ తీవ్ర పోటీ..!

Liquor Shops Lucky Draw | రేపు మద్యం షాపుల డ్రా తీసేందుకు ఎక్సైజ్‌శాఖ ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు కలెక్టర్లు లాటరీ తీయనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Liquor Shops Lucky Draw | తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది.

ఇందుకు సంబంధించిన లక్కీ డ్రాను రాష్ట్ర వ్యాప్తంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.

జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తి పారదర్శకతతో ప్రక్రియ చేపడతారు.

Liquor Shops Lucky Draw | గట్టి పోటీ..

రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో మొత్తం 95,000 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి 36 వరకు అన్నమాట.

గ్రేటర్​ హైదరాబాద్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఇక శంషాబాద్ పరిధిలోని 100 మద్యం దుకాణాలకు ఏకంగా 8,536 దరఖాస్తులు వచ్చాయి.

సరూర్​ నగర్​లోని 134 దుకాణాలకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక, మద్యం షాపుల లైసెన్స్ వ్యవధి తెలంగాణలో రెండేళ్లపాటు ఉంటుంది.

Must Read
Related News