అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Liquor Sales | రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు 2025కు వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో పాటు రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం రాత్రి పార్టీలు చేసుకున్నారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబర్ చివరి 4 రోజుల్లో ఏకంగా రూ.1,230 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగడం గమనార్హం. రాష్ట్రంలో డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ (Excise Department)కు భారీగా ఆదాయం వచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ ప్రారంభం అయింది. అయితే కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారికి తొలి నెలలోనే భారీగా ఆదాయం వచ్చింది. సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections), డిసెంబర్ 31 వేడుకల నేపథ్యంలో నెలలో ఏకంగా రూ.5,052 కోట్ల లిక్కర్ సేల్ అయింది.
Liquor Sales | మద్యం అమ్మకాల వివరాలు
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 28 నుంచి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. 28న రూ.182 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు (Excise Officers) తెలిపారు. 29న రూ.282 కోట్లు, 30న రూ.375 కోట్లు, 31న రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.1,230 కోట్ల మందు అమ్ముడుపోయింది. దీంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి యువత, మద్యంప్రియులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ జోరందుకున్నాయి.