HomeతెలంగాణLiquor prices hike | మద్యం ప్రియులకు షాక్​.. రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

Liquor prices hike | మద్యం ప్రియులకు షాక్​.. రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Liquor prices hike | తెలంగాణ రాష్ట్ర telangana govt ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్​ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను liquor price పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చీప్ లిక్కర్ Cheap liquor మినహా మిగతా అన్ని రకాల మద్యం​ రేట్లను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్​(180 ఎంఎల్​) బాటిల్​పై రూ.10 పెంచింది. ఆఫ్​ బాటిల్​పై రూ.20, ఫుల్​ బాటిల్​పై రూ.40 రేటు పెంచుతూ ఎక్సైజ్​ శాఖ Excise Department ఆదివారం సర్క్యూలర్​ జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో మద్యం ద్వారా కూడా అధికంగా వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మందుబాబులపై ఆ భారం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా లిక్కర్​ ధరలను కూడా పెంచింది.