అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్ క్లబ్ సభ్యులు సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు క్యాబినెట్ ట్రెజరర్ లక్ష్మీనారాయణ (Lakshminarayana) అన్నారు. బుధవారం ఉదయం నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో (Vamshi International Hotel) పీఎస్టీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లబ్‌ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అంకితభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో లయన్స్ రీజియన్ ఛైర్మన్ ఉదయ సూర్యభగవాన్, రీజియన్ కో-ఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ ఛైర్మన్లు నరసింహరావు, భూమన్న, అవన్ తదితరులు పాల్గొన్నారు.
