Homeజిల్లాలునిజామాబాద్​Lions Club | సేవే లక్ష్యంగా పనిచేస్తున్న లయన్స్​ క్లబ్​లు

Lions Club | సేవే లక్ష్యంగా పనిచేస్తున్న లయన్స్​ క్లబ్​లు

జిల్లాలో లయన్స్​ క్లబ్​లు సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాయని క్లబ్​​ నిజామాబాద్​ రీజియన్​ ఛైర్మన్​ ఉదయ సూర్యభగవాన్​ పేర్కొన్నారు. నగరంలోని సందీప్​ గార్డెన్​లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Lions Club | జిల్లాలో లయన్స్​ క్లబ్​లు సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాయని లయన్స్​ నిజామాబాద్​ రీజియన్​ (Nizamabad Region) ఛైర్మన్​ ఉదయ సూర్యభగవాన్​ పేర్కొన్నారు. నగరంలోని సందీప్​గార్డెన్​లో శుక్రవారం లయన్స్ ఇంటర్నేషనల్ (Lions International​)​ నిజామాబాద్​ రీజియన్​ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్​ రీజియన్ పరిధిలో క్లబ్​ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ‘శుభారంభ్​’ పేరిట ఒకేరోజు 85 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాలని క్లబ్​ పీఎస్టీలకు సూచించారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శి డి.యాదగిరి, అదనపు కోశాధికారి పి.లక్ష్మీనారాయణ, రీజియన్ కో–ఆర్డినేటర్ నాగేశ్వరరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్, జోన్ ఛైర్మన్లు దారం భూమన్న, బొబ్బ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.