అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్ క్లబ్ పంతం.. డయాబెటిస్ అంతం అని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో డయాబెటిక్ వాక్ (Diabetic Walk) నిర్వహించారు.
వినాయక్‌నగర్‌లోని హనుమాన్ జంక్షన్ నుంచి బోర్గాం(పి) బిడ్జి వరకు వాక్ కొనసాగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ ఛైర్మన్ ఉదయ సూర్యభగవాన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహం వ్యాధి గురించి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మధుమేహం నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్‌లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. వ్యాయామం, యోగా, నడకతో మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మధుమేహం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు డయాబెటిక్ వాక్ నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ కోఆర్డినేటర్ దాసరి నాగేశ్వరరావు, జిల్లా అదనపు కార్యదర్శి పి.లక్ష్మీనారాయణ, జోన్ ఛైర్మన్లు అవన్, నర్సింహరావు, భూమన్న, కార్యదర్శులు శివాజీ, లక్ష్మణ్, రవీందర్, ద్వారకాదాస్, రీజియన్ పీఆర్వో గంగాదాస్, లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు, బీబీసీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
