అక్షర టుడే, కమ్మర్‌పల్లి: Kammarpally | లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి శాఖ (Lions Club of Kammarpally branch) ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో (ZP High School) గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు సల్లూర్ కిషన్ గౌడ్ మాట్లాడుతూ.. సేవే మార్గంగా ముందుకెళ్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంధ్రయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
