ePaper
More
    Homeక్రీడలుLionel Messi | ఇండియాకి రాబోతున్న ఫుట్‌బాల్ దిగ్గ‌జం... కోహ్లీ,రోహిత్‌, స‌చిన్‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌నున్న...

    Lionel Messi | ఇండియాకి రాబోతున్న ఫుట్‌బాల్ దిగ్గ‌జం… కోహ్లీ,రోహిత్‌, స‌చిన్‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌నున్న మెస్సీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lionel Messi | ప్రపంచ ఫుట్‌బాల్ హిస్టరీలో అద్భుత క్రీడాకారుడిగా పేరు గడించిన లియోనెల్ మెస్సీ ఈసారి ఫుట్‌బాల్ కాదు.. క్రికెట్ బరిలోకి దిగబోతున్నారు. డిసెంబర్ 14న ముంబయి వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో మెస్సీ క్రికెట్ బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే క్రీడాభిమానులకు ఓ అద్భుత దృశ్యంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలతో పాటు మరికొందరు మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 14న వాంఖడే స్టేడియాన్ని ఒక ప్రముఖ ఈవెంట్ సంస్థ బుక్ చేసేందుకు ఇప్పటికే ముంబయి క్రికెట్ అసోసియేషన్‌(Mumbai Cricket Association)ను సంప్రదించిందని సమాచారం.

    మెస్సీ(Lionel Messi) డిసెంబర్ 13 నుంచి 15 వరకు భారత పర్యటనలో ఉండనున్నట్టు సమాచారం. ముంబయితో పాటు ఢిల్లీ, కోల్‌కతా నగరాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. గతంలో, 2011లో కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం(Kolkata Salt Lake Stadium)లో వెనిజులాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన మెస్సీకి.. భారత్‌ విజిట్ రెండో సారి కావడం విశేషం. ప్రస్తుతం 38 ఏళ్ల మెస్సీ, అమెరికాలో మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మయామీ తరఫున ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఫీఫా వరల్డ్ కప్‌(FIFA World Cup) తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా మెస్సీ మరో మల్టీ-టాలెంటెడ్ అవతారం ప్రదర్శించబోతున్నాడు.

    ఈ క్రికెట్ ఈవెంట్‌పై అధికారిక షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అయితే మెస్సీ వాంఖడే  మైదానంలో బ్యాట్‌తో కనిపిస్తే, అది కేవలం క్రీడా రంగానికే కాకుండా అంతర్జాతీయ స్పోర్ట్స్(International Sports) వేదికపై ఓ చారిత్రక క్షణంగా నిలవనుంది. దీని కోసం అటు క్రికెట్ ప్రేమికుల‌తో పాటు ఫుట్ బాల్ ప్రేమికులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల కాగా, దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    Latest articles

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు...

    More like this