అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | ఫుట్‌బాల్ ప్రపంచంలో దిగ్గజంగా గుర్తింపు పొందిన లియోనెల్ మెస్సీ (Lionel Messi), మైదానంలో తన ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేయడమే కాదు.. మైదానం బయట కూడా రాజసమైన జీవనశైలితో వార్తల్లో నిలుస్తుంటాడు.
అతడి లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు ప్రతీకగా నిలిచేది అతడి సొంత ప్రైవేట్ జెట్. స్పానిష్ ప్రముఖ పత్రిక మార్కా (Spanish newspaper Marca) కథనం ప్రకారం.. మెస్సీ వద్ద సుమారు 15 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.125 కోట్లు) విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V ప్రైవేట్ విమానం ఉంది. 2004లో తయారైన ఈ జెట్‌ను మెస్సీ 2018లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇది అర్జెంటీనాలో LV-IRQ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయి ఉంది.
Lionel Messi | మెస్సీ అభిరుచులకు అద్దం పడే డిజైన్
ఈ జెట్‌లో Jet మెస్సీ వ్యక్తిగత అభిరుచులు స్పష్టంగా కనిపిస్తాయి. విమానం తోక భాగంపై ఆయన జెర్సీ నంబర్ అయిన ‘10’ ను ప్రత్యేకంగా ముద్రించారు. అంతేకాదు, విమానం ఎక్కే మెట్లపై తన భార్య ఆంటోనెలా, పిల్లలు థియాగో, మాటియో, సిరో పేర్లను రాయించుకున్నాడు. ఇది కుటుంబంపై మెస్సీకి ఉన్న ప్రేమకు నిదర్శనంగా అభిమానులు చెబుతున్నారు.
- అత్యాధునిక సదుపాయాలు
- గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
- పూర్తిస్థాయి కిచెన్
- రెండు బాత్రూమ్లు
- 16 లగ్జరీ సీట్లు
Lionel Messi | అవసరమైతే ఈ సీట్లను 8 బెడ్లుగా మార్చుకునే సదుపాయం
దీంతో సుదూర ప్రయాణాల్లో మెస్సీతో పాటు అతడి కుటుంబం, సిబ్బంది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, క్లబ్ కమిట్మెంట్స్ కోసం ఖండాలు దాటి ప్రయాణించే మెస్సీకి ఈ జెట్ ఎంతో ఉపయోగపడుతోంది.
Lionel Messi | గల్ఫ్‌స్ట్రీమ్ V ప్రత్యేకత
1997లో మార్కెట్లోకి వచ్చిన గల్ఫ్‌స్ట్రీమ్ V మోడల్‌ను శక్తివంతమైన రోల్స్ రాయిస్ ఇంజిన్లు నడుపుతాయి. వేగం, భద్రత, లాంగ్ రేంజ్ ప్రయాణ సామర్థ్యానికి ఈ విమానం (Aeroplane) ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచింది. అందుకే అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు ఇదే మోడల్‌ను వినియోగిస్తున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ జెట్‌కు ముందు మెస్సీ సుమారు 35 మిలియన్ డాలర్ల విలువైన ఎంబ్రేయర్ లెగసీ 650 ప్రైవేట్ జెట్‌ను ఉపయోగించాడు. మైదానంలో ‘గోట్’గా పేరు తెచ్చుకున్న మెస్సీ, లగ్జరీ లైఫ్స్టైల్లోనూ తన స్థాయిని మరోసారి చాటుకున్నాడు.