అక్షరటుడే, లింగంపేట: Lingampeta Mandal | లింగంపేట మండల మున్నూరు కాపు (Munnur kapu) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పది, ఇంటర్ లో ప్రతిభ చాటిన మున్నూరు కాపు విద్యార్థులకు (Students) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుండ బాలకిషన్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, సంఘం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు చేపూరి పోశెట్టి, చందు, రాములు, కాశిరాం, అనురాజ్, రవి, తదితరులు పాల్గొన్నారు.
