అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | ‘జోష్’ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో లింగంపేట మైనారిటీ పాఠశాల (Lingampet Minority School) విద్యార్థులు ప్రతిభ చూపారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారు.
Lingampet Mandal | నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో (Minority Gurukul School) ఈనెల 19, 20, 21 తేదీల్లో క్రీడాపోటీలు జరిగాయని లింగంపేట పాఠశాల హెచ్ఎం వెంకట్ రాములు పేర్కొన్నారు. 3వ జోష్ స్పోర్ట్స్‌లో మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు అండర్–14 కబడ్డీలో ప్రథమస్థానం, అండర్–14 వాలీబాల్‌లో ప్రథమ స్థానం, టెన్నికాయిట్‌లో ఆమీర్ టెన్త్‌క్లాస్ ద్వితీయ స్థానం, అండర్–14 షాట్‌పుట్‌లో సంతోష్ (8వ తరగతి) సెకండ్ ప్లేస్, అండర్–17 200 మీటర్ల రన్నింగ్ పోటీలో ఆమీర్ (పదో తరగతి) థర్డ్ఇయర్, మార్చ్ ఫస్ట్‌లో తృతీయ స్థానం సాధించారని తెలిపారు.
Lingampet Mandal | 13 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక
లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం తెలిపారు. సిద్ధిరహన్ (8వ తరగతి), ముస్తఫా (10వ తరగతి) బాల్ బ్యాడ్మింటన్ పోటీలు, ఫుట్‌బాల్ పోటీలకు అబ్దుల్ హమన్ (10వ తరగతి) మోతాషిమ్ (10వ తరగతి), హ్యాండ్‌బాల్ పోటీలకు సురేష్ నాయక్ (10వ తరగతి), వాలీబాల్ పోటీలకు ఎస్కే రెహమాన్, సుశాంత్, హరి ప్రసాద్, కబడ్డీ పోటీలకు గౌతమ్, ఎస్కే మాజ్ అప్నాన్, తౌఫిక్, అర్హన్ ఎంపికైనట్లు పాఠశాల వెల్లడించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక కావడంపై వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్ సింగ్‌ను అభినందించారు.