HomeతెలంగాణACB Raid | ఏసీబీకి చిక్కిన లైన్ ​ఇన్​స్పెక్టర్​

ACB Raid | ఏసీబీకి చిక్కిన లైన్ ​ఇన్​స్పెక్టర్​

విద్యుత్​ మీటర్లకు సర్వీస్​ నంబర్​ కేటాయించడానికి లంచం అడిగిన లైన్​ ఇన్​స్పెక్టర్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. విద్యుత్​ మీటర్ల సర్వీస్​ నంబర్​ కేటాయించడానికి లంచం అడిగిన లైన్​ ఇన్​స్పెక్టర్ (Line Inspector)​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే వారిని డబ్బులు అడుగుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు చేపడుతున్నా.. భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad)​ పెద్ద అంబర్‌పేట్‌లోగల సహాయక ఇంజినీరు(ఆపరేషన్స్) కార్యాలయంలోని లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్​ను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.

ఒక ప్రైవేట్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనంలో 63 KV ట్రాన్స్‌ఫార్మర్, నూతన విద్యుత్ మీటర్లకు సర్వీస్ నంబర్‌లను విడుదల చేయడానికి లైన్​ ఇన్​స్పెక్టర్​ ప్రభులాల్​ రూ.6 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ప్రభులాల్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ACB Raid | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.