అక్షరటుడే, భీమ్గల్: Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు భీమ్గల్ (Bheemgal) లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ (Lakshmi Narasimha Swamy Temple) హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదాయం రూ. 8,28.642 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారధి తెలిపారు.
నిజామాబాద్ దేవాదాయ శాఖ (Nizamabad Endowment Department) కమిషనర్ విజయ రామారావు ఆధ్వర్యంలో చేపట్టిన హుండీ లెక్కింపులో (Hundi calculation) దేవాలయ హుండీ ద్వారా రూ. 5,94,737, అన్నదాన హుండీ ద్వారా రూ. 2,33,905 సమకూరినట్లు చెప్పారు. ఇందులో నుంచి రూ. 4,69,112 ప్రభుత్వ నిధులకు జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.