Homeఅంతర్జాతీయంPutin | భారత సినిమాలంటే ఇష్టం.. పుతిన్​ కీలక వ్యాఖ్యలు

Putin | భారత సినిమాలంటే ఇష్టం.. పుతిన్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్​ భారత్​ సహా విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్​(Putin) భారత సినిమాలంటే ఇష్టమని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత సినిమా(Indian Films)లకు రష్యాలో చాలా పాపులారిటీ ఉందని పుతిన్​ పేర్కొన్నారు. సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమకు ఇండియన్​ మూవీస్​ అంటే చాలా ప్రేమ అన్నారు. భారత సినిమాలను 24 గంటలు ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా ఓ ఛానల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్​–రష్యా మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు సంబంధాలతో పాటు, సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందన్నారు.

 Putin | సోవియెట్​ కాలం నుంచే..

సోవియెట్​ యూనియన్​ విచ్ఛిన్నం కాకముందు నుంచే అక్కడ భారత సినిమాలకు ఆదరణ ఉంది. రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి వంటి బాలీవుడ్‌ స్టార్ల సినిమాలకు అక్కడ బాగా క్రేజ్​ ఉండేది. ఇప్పటికి అక్కడ వారి పేర్లు వినిపిస్తాయి. నాటో, సోవియెట్​ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన సమయంలో రష్యా పాశ్చాత్య సినిమాలపై నిషేధం విధించింది. అప్పటి నుంచి అక్కడ బాలీవుడ్‌ చిత్రాలకు క్రేజ్​ పెరిగింది.

 Putin | మిథున్​ చక్రవర్తికి ఫ్యాన్స్​

బాలీవుడ్​ స్టార్​ మిథున్​ చక్రవర్తి(Mithun Chakravarthy)కి రష్యాలో చాలా మంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఆయన 1982లో నటించిన ‘డిస్కో డ్యాన్సర్‌’ మూవీ సోవియట్‌ యూనియన్‌లో సూపర్​ హిట్​ అయింది. ఆ చిత్రాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో హిట్​ సాంగ్​ అయిన ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ అనే పాట రష్యాలో మార్మోగిపోయింది.