అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Meteorological Department) చల్లని కబురు చెప్పింది. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు (Scattered Rains) కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి పూట తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి పూట వాన పడుతుంది. అయితే ఈ వర్షాలు విస్తృతంగా ఉండవు. అక్కడక్కడ మాత్రం తేలికపాటి వానలు కురుస్తాయి. దక్షిణ తెలంగాణ (South Telangan)లో సాయంత్రం పూట వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట చిరుజల్లులు కురుస్తాయి. రేపటి నుంచి దక్షిణ తెలంగాణలో వానలు పెరగనున్నాయి.
Weather Updates | రైతుల ఆందోళన
రాష్ట్రంలో ఈ సారి వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడితే పంటలకు మేలు జరుగుతుంది. అయితే వరుసగా వారం రోజుల పాటు కురిసిన వానలు.. మళ్లీ వారం అయినా జాడ లేకుండా పోయాయి. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా వర్షాలు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆరుతడి పంటలు వాడిపోతున్నాయి. అయితే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు.