అక్షరటుడే, ఆర్మూర్ : Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి వరద (Flood) కొనసాగుతోంది. అయితే ఇటీవల వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేశారు. అయితే శనివారం మధ్యాహ్నం మళ్లీ వరద పెరగడంతో ప్రాజెక్టు జెన్కో (GENCO) ఎస్కేప్ గేట్లను ఎత్తివేశారు. ఈ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈఈ కొత్త రవి (AEE Kotha Ravi) తెలిపారు.
Sriramsagar Project | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రాజెక్టు దిగువన గోదావరి నది (Godavari River) తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్తరవి హెచ్చరించారు. పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ హెచ్చరికలు గోదావరి నదికి వరదలు ఉన్నన్ని రోజులు అక్టోబర్ చివరి వరకు వర్తిస్తాయని సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091.00 అడుగులకు (81 టీఎంసీలు) గాను.. ప్రస్తుతం 1,090 అడుగుల (80.501 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.