అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project) పరిధిలోని ఆరేడు గ్రామ శివారులో సుమారు 35 ఏళ్ల క్రితం వరదగేట్లను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాటిని ఎత్తే అవసరం రాలేదు. ఇన్నేళ్లకు మంగళవారం గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు (Irrigation Department Officers) ఎత్తారు. దీంతో గ్రామస్థులంతా ఈ గేట్లను ఆసక్తిగా తిలకించారు.
Nizamsagar Project | వరదగేట్ల పనితీరును పరిశీలించేందుకు..
వరదగేట్ల పనితీరును పరిశీలించేందుకు అధికారులు మంగళవారం వాటిని ఎత్తారు. దిగువకు నీటిని వదులుతున్నారు. ‘‘ఎప్పుడో చిన్నతనంలో ఈ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తేటప్పుడు చూశామని.. ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని..” గ్రామస్థులు చర్చించుకున్నారు. ఆరేడు వరద గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టడంతో సమీపంలోని ఆరేపల్లి, మర్పల్లి, లింగంపల్లి, అచ్చంపేట గ్రామాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి విడుదలను సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్, ఏఈలు పరిశీలించారు.
