అక్షరటుడే, నిజాంసాగర్ : Singitham Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి ఎగువ భాగం భారీగా వరద (Heavy Flood) వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో మూడుగేట్లను ఎత్తి నిజాంసాగర్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఏఈలు శివకుమార్ సాకేత్ (AE Shivakumar Saket) ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీటిని కాలువకు విడుదల చేశారు.
సింగితం రిజర్వాయర్ (Singitham Reservoir) నీటి సామర్థ్యం 416.550 మీటర్లు కాగా.. ప్రస్తుతం 415.900 మీటర్ల ఎత్తులో నీటినిల్వ ఉంది. అయితే సింగితం రిజర్వాయర్ పరిధిలోని నర్వ శివారులో ఆర్నెళ్ల క్రితం తూము వద్ద బుంగ పడడంతో ఇసుక బస్తాలను వేసి నీటి వృథాను అరికట్టారు. అయితే సింగితం రిజర్వాయర్లోకి ఎగువ భాగం నుంచి వస్తున్న ఇన్ఫ్లో కారణంగా బుంగ మరింత పెద్దగా అయ్యే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా గేట్ల ద్వారా నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు విడుదల చేశారు.
