అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో 19 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్(Nizamsagar)లోకి ప్రస్తుతం 1,23,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు వరద గేట్ల ద్వారా 1,24,407 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 12.203 టీఎంసీల నీరు ఉంది. జలాశయం నుంచి నిరంతరంగా నీటి విడుదల జరుగుతుండడంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.
Nizamsagar Project | పోచారం ప్రాజెక్టులో..
పోచారం ప్రాజెక్టు(Pocharam Project)లోకి సైతం వరద వస్తోంది. వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తూనే ఉంది. ప్రాజెక్టులోకి 5,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుగా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు అలుగుపై నుంచి పొంగి మంజీరలో కలుస్తోంది.