అక్షరటుడే, ఇందూరు: GGH Nizamabad | జిల్లా జనరల్ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. ఆస్పత్రిలో పైఅంతస్తు నుంచి కింది అంతస్తుకు రోగులు, వారి బంధువులు కిందికి వచ్చే సమయంలో అర్ధాంతరంగా మధ్యలోనే లిఫ్ట్ నిలిచిపోయింది. సుమారు అరగంట పాటు అందులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు లిఫ్ట్‌లో (Lift) ఉన్న వారిని అతికష్టంమీద బయటకు తీసుకొచ్చారు.
GGH Nizamabad | ఆది నుంచీ అలసత్వమే..
అయితే లిఫ్ట్‌ల నిర్వహణ విషయంలో అలసత్వంతోనే అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చర్చించుకుంటున్నారు. కొన్నేళ్లుగా జీజీహెచ్‌లో లిఫ్ట్‌ల సమస్యకు పరిష్కారం లభించడం లేదు. దీంతో నిత్యం రోగులు అవస్థలు పడుతున్నారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతోందని అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవట్లేదని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.